NLG: నల్లగొండ జిల్లా చింతలపాలెం గ్రామంలో వినాయక చవితి పూజ వివాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణతో మనస్తాపానికి గురైన పురోహితుడు దత్తాత్రేయ శర్మ గుండెపోటుతో కన్నుమూశారు. ఈ ఘటనను నిరసిస్తూ, ఆయన కుటుంబానికి మద్దతుగా మిర్యాలగూడలో పురోహితులు ఈరోజు నిరసన ర్యాలీ నిర్వహించారు.
తెలంగాణ
పురోహితుడి మృతి..మిర్యాలగూడలో ర్యాలీ!


