హైదరాబాద్: 28°C
తెలంగాణ

జింకలపల్లిలో ఉచిత వైద్య శిబిరం

GDWL: మోదీ జన్మదినం సందర్భంగా ఇటిక్యాల మండలం జింకలపల్లి స్టేజ్ వద్ద బీజేపీ నేతలు మెగా రక్తదాన, ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశంలో వెనుకబడిన వర్గాల సంక్షేమం, అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక ప్రత్యేక పథకాలను అమలు చేస్తూ సేవనందిస్తోందని కొనియాడారు.