హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ కోతలపై రైతుల ఆగ్రహం

SRPT: చివ్వెంల మండలంలోని చందుపట్ల సబ్‌స్టేషన్‌ను బీఆర్ఎస్ రైతు విభాగం నాయకులు, రైతులు ముట్టడించారు. చందుపట్ల, మొగ్గయ్యగూడెం, భీమ్లాతండా గ్రామాల్లో నెల రోజులుగా నిరంతర విద్యుత్ కోతలు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రివేళల్లోనూ కోతలు ఉండటంతో పంటలకు సాగునీరు అందించలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.