హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కమ్యూనిస్టుల పోరాట చరిత్రను మార్చలేరు'

WNP: అంబేద్కర్ చౌక్‌లో సీపీఐ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు నిర్వహించారు. పోరాట యోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిపిఐ నాయకులు రమేష్, శ్రీరామ్ మాట్లాడుతూ భూమి, భుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం సాగిందన్నారు. నాటి పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు.