హైదరాబాద్: 28°C
తెలంగాణ

విశ్వకర్మ పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే

NGKL: లింగాల మండల కేంద్రంలో నూతన మార్కండేయ ఆలయంలో గురువారం విశ్వకర్మ పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొని విశ్వకర్మ పూజలు చేశారు. అనంతరం ఆయనను శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఈశ్వరమ్మ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.