హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుండెపోటుతో అటెండర్ మృతి

MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు ఎస్సీ కాలనీకి చెందిన రెవెన్యూ అటెండర్ కుందన బిక్షపతి గురువారం ఉదయం గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందారు. ఆయన కొంతకాలంగా లోకల్ తహశీల్దార్ ఆఫీస్‌లో సేవలు అందిస్తున్నారు. బిక్షపతి మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేసి, వారి కుటుంబాన్ని పరామర్శించారు.