హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాడికల్ సర్పంచ్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే

కరీంనగర్‌లోని శ్రీ మైత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శంకరపట్నం మండలం తాడికల్ సర్పంచ్ దుర్గపు సుజాతను మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గురువారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు బత్తిని శ్రీనివాసగౌడ్, బండారి రమేశ్ పాల్గొన్నారు.