NRML: భైంసా పట్టణంలోని స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో గురువారం విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం చేపట్టారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు బెజ్జంకి రవీంద్రచారి, కార్యదర్శి రంగు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు విద్యాసాగర్, కోశాధికారి రాజు, విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ
భైంసాలో విశ్వకర్మ జయంతి వేడుకలు


