హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ హామీలను నెరవేర్చాలి: శ్రీనివాస్ గౌడ్

MDCL: అల్వాల్‌లో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలను మాజీ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 250 గజాల స్థలం, పెన్షన్, గుర్తింపు కార్డులు, అమరుల కుటుంబాలకు ప్రత్యేక నిధి హామీలను నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.