హైదరాబాద్: 28°C
తెలంగాణ

పింఛన్‌ దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన: MPDO

KMM: కరకగూడెం మండలంలో కొత్తగా పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నట్లు ఎంపీడీవో పి.శ్రీనివాస్ తెలిపారు. గురువారం కరకగూడెం, చిరుమళ్ల గ్రామాల్లో అధికారులతో కలిసి ఇంటింటికీ వెళ్లి పరిశీలన పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. త్వరలో అన్ని గ్రామపంచాయతీల్లో తనిఖీలు చేపట్టి వివరాలను యాప్‌లో నమోదు చేస్తామని ఆయన తెలిపారు.