హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రుద్రభూమిని పరిరక్షించాలని వినతి

AKP: అచ్యుతాపురం మండలం దోసూరు గ్రామం సర్వే నంబర్‌ 123లోని రుద్రభూమిని ఆక్రమించి గోడ నిర్మిస్తున్నారని విశ్వబ్రాహ్మణ కులస్తులు ఆరోపించారు. ఈ మేరకు గురువారం తహసీల్దార్‌ డీ.శ్రీనుకు వినతిపత్రం అందజేశారు. 20 ఏళ్లుగా అక్కడే దహన సంస్కారాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రుద్రభూమిని పరిరక్షించి, గోడ నిర్మాణాన్ని నిలిపివేసి సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.