AKP: రాంబిల్లి మండలం పంచదారల ఎస్సీ కాలనీలో ఐద్వా ప్రతినిధులు గురువారం పర్యటించారు. వర్షాభావంతో పంటలు సాగు చేయలేక రైతులు, వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని జిల్లా అధ్యక్షురాలు మాణిక్యం, జాయింట్ సెక్రటరీ సీహెచ్ మంగతాయారు తెలిపారు. ప్రభుత్వం వెంటనే అనకాపల్లి జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులు వ్యవసాయ కూలీలను ఆదుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కరువు జిల్లాగా ప్రకటించాలి'


