హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెడసనగల్లులో వినాయకుడికి ప్రత్యేక పూజలు

కృష్ణా: మొవ్వ మండలం పెడసనగల్లులో వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా గురువారం పాల్గొన్నారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని వినాయకుడిని ప్రార్థించినట్లు తెలిపారు.