హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్న క్యాంటీన్‌ను సందర్శించిన నేతలు

VZM: రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశాల మేరకు గురువారం గజపతినగరంలోని అన్న క్యాంటీన్‌ను టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు గంటేడ శ్రీదేవి, ఏఎంసీ ఛైర్మన్ గోపాలరాజులు సందర్శించారు. ఈ సందర్భంగా భోజనం రుచి, నాణ్యత, మౌలిక వసతులు సదుపాయాలు ఆహార సరఫరా విధానం తదితర అంశాలను పరిశీలించారు. అలాగే భోజనం చేస్తున్న వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.