హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేగిడిలో సేవా సంకల్ప్ అభియాన్

PPM: గుమ్మలక్ష్మీపురం మండలం రేగిడి గ్రామంలో సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం వైద్య శిబిరం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల నిస్వార్థ ప్రజాసేవను పురస్కరించుకుని ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరంలో గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులను అందజేశారు.