హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పామిడి మండలంలో 480 మంది నూతన పింఛన్లకు దరఖాస్తులు

అనంతపురం: పామిడి మండల వ్యాప్తంగా 480 నూతన పింఛన్లు దరఖాస్తు చేసుకున్నట్లు ఇంచార్జ్ ఎంపీడీవో ప్రభాకర్ నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నూతన పింఛన్ ల దరఖాస్తుకు ఈరోజుతో గడువు ముగుస్తుందని సుమారుగా 480 మంది నూతన పింఛన్లను దరఖాస్తు చేసుకున్నారని వారు తెలిపారు. అర్హులైన వారిని గుర్తించి పింఛన్లను మంజూరు చేస్తామన్నారు.