హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అధ్వానంగా రహదారి'

నెల్లూరు: జాతీయ రహదారి నుంచి దుత్తలూరు గ్రామంలోకి వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా తయారయింది. అడుగడుగునా గుంతలు ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుందని వాపోతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మత్తుల పనులు చేపట్టాలని కోరుతున్నారు.