హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ గో తరలింపు భగ్నం

BHPL: మహారాష్ట్ర నుంచి నర్సంపేటకు ఎలాంటి పత్రాలు లేకుండా బొలెరో వాహనంలో తరలిస్తున్న గోవులను గురువారం భూపాలపల్లి ప్రధాన రహదారిపై పట్టుకున్నారు. ఓరుగంటి భగవాన్వేషాల హరీశ్ తదితరులు గోవులను అదుపులోకి తీసుకుని గోసంరక్షణ కార్యకర్త రేగళ్ల వంశీకృష్ణ సహకారంతో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పంచనామా అనంతరం గోవులను గోశాలకు తరలించినట్లు తెలిపారు.