VKB: దోమ మండలం మోత్కూర్ గేటు వద్ద పరిగి-మహబూబ్‌నగర్ రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 24 గంటల విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కేవలం 7 గంటలు మాత్రమే, అదీ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉందని మండిపడ్డారు. హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని బైటాయించారు.
తెలంగాణ
VIDEO: రైతుల రాస్తారోకో.. నిలిచిన వాహనాలు


