ASR: చింతపల్లి మండలం లంబసింగి వారపు సంతను గురువారం సీఐ బీ.సింహాచలం సందర్శించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, మహిళల భద్రత, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మహిళల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
వారపు సంతలో అవగాహన కార్యక్రమం


