హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజా ఆస్తుల పరిరక్షణే HYDRAA లక్ష్యం: రంగనాథ్

HYD: ప్రజా ఆస్తుల పరిరక్షణే HYDRAA ప్రధాన విధి అని కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా HYDRAA కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ప్రభుత్వ భూములు, పార్కులు, చెరువులు, నాలాలు కాపాడాలని సిబ్బందికి సూచించారు. ఇప్పటివరకు 3 వేల ఎకరాలకు పైగా భూములను పరిరక్షించామని, వాటి విలువ రూ.1.50 లక్షల కోట్లకు పైగా ఉంటుందన్నారు.