హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సబ్సిడీపై పశు దాన పంపిణీ

AKP: పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో 50 శాతం సబ్సిడీపై గురువారం పశువుల దాణా పంపిణీ చేశారు. గొలుగొండ, చోద్యం, కేడీపేట పశువైద్య కేంద్రాల పరిధిలోని 286 మంది రైతులకు 20 మెట్రిక్ టన్నుల దాణా అందించారు. పాడి రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గించి, పాల దిగుబడిని పెంచడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దుర్గాప్రసాద్, డాక్టర్ సురేష్ పాల్గొన్నారు.