హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో భక్తులతో ముచ్చటించిన టీటీడీ ఈవో

TPT: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం జరిగిన సింహ వాహనసేవ సందర్భంగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర భక్తులతో ముచ్చటించారు. టీఎన్, హైదరాబాద్, నెల్లూరు, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులను కలిసి దర్శన ఏర్పాట్లు, వాహనసేవ వీక్షణ, సౌకర్యాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. టీటీడీ ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.