హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కేదారి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి

హన్మకొండ నగరంలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డ లింగాల కేదారి కుటుంబాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని, తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం కేదారి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం అందజేశారు.