హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడ మట్టి గణపతికి ప్రపంచ రికార్డు

NTR:: విజయవాడలోని విద్యాధరపురంలో డూండీ గణేశ సేవా సమితి నెలకొల్పిన 72 అడుగుల శ్రీపంచముఖ వరసిద్ధి మహా గణపతి మట్టి విగ్రహం 'ఇంజీనియస్ ఛార్మ్ వరల్డ్ రికార్డ్' సాధించింది. అత్యంత ఎత్తయిన పర్యావరణ హిత గణేశుడిగా దీనికి గుర్తింపు లభించింది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చేతుల మీదుగా నిర్వాహకులు రికార్డు పత్రాన్ని అందుకున్నారు.