హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఇచ్చిన మాట ప్రకారంపెన్షన్లు ఇవ్వండి'

విజయనగరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎన్నికలు ముందు కూటమి ప్రభుత్వం 50 సం.లు దాటిన కుటుంబంలో ఒకరికి పెన్షన్ ఇస్తామని చెప్పి నేడు 60సం.లు నిండిన వారు మాత్రమే అర్హులని అనటం ఎంత వరకు సమంజసం అన్నారు. ఈ సమస్యను పరిష్కరించకపొతే కలెక్టర్ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తుందన్నారు.