హైదరాబాద్: 28°C
తెలంగాణ

మోదీ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం

JGL: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి ఉపయోగపడేలా రక్తదానం చేయడం సామాజిక బాధ్యత అని నిర్వాహకులు పేర్కొన్నారు.