హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెలంగాణ విమోచన యోధులకు పవన్ నివాళి

KKD: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిజాం పాలన, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన వీరయోధులకు ఉప ముఖ్యమంత్రి, పవన్‌ కళ్యాణ్‌ నివాళులర్పించారు. ప్రజల్లో స్వేచ్ఛా స్ఫూర్తిని రగిలించిన కవులు, రచయితల సేవలను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. మాతృభూమి సమగ్రత, ఐక్యత, సార్వభౌమత్వం కోసం వారు చూపిన ధైర్యం, ప్రదర్శించిన నిబద్ధత చిరస్మరణీయమని పేర్కొన్నారు.