హైదరాబాద్: 28°C
క్రీడలు

మ్యాచ్‌ రద్దు.. సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్‌

వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే చైనాపై బంగ్లాదేశ్‌ మహిళల క్రికెట్‌ జట్టు సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది. తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో చైనా కంటే మెరుగైన స్థితిలో ఉండటంతో బంగ్లాను విజేతగా ప్రకటించారు. దీంతో ఎలాంటి మ్యాచ్‌ ఆడకుండానే బంగ్లా సెమీస్‌లోకి ప్రవేశించింది.