హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆత్మ రక్షణ శిక్షణకు కోచ్‌ల కోసం దరఖాస్తులు

 రాజన్న సిరిసిల్ల జిల్లాలో బాలికల ఆత్మరక్షణ శిక్షణకు కోచ్‌లు కావాలని క్రీడాశాఖ ప్రకటించింది. 72 ప్రభుత్వ పాఠశాలల్లో కరాటే, కుంగ్‌ఫూ, జూడో, కళరిలో అనుభవం, బ్లాక్ బెల్ట్ ఉన్న 21-45 ఏళ్ల వారు అర్హులని అధికారులు తెలిపారు. ఈనెల 18 నుంచి 24 సెప్టెంబర్ వరకు రూమ్ నెం.19, జిల్లా క్రీడా కార్యాలయంలో సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకోవాలని అధికారి ఎ.రాందాస్ తెలిపారు.