SDPT: కోహెడ మండల కేంద్రంలోని బాడుగుల చెరువు అభివృద్ధికి రూ.2.40 కోట్లు మంజూరయ్యాయి. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ నిధులు కేటాయించగా, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక సహకారం అందించారు. ఈ నిధులతో చెరువు వద్ద సుందరమైన పార్కుతో పాటు ఇతర మౌలిక వసతులు కల్పిస్తారు. నిధులు తెచ్చిన మంత్రులకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
చెరువు అభివృద్ధికి రూ. 2.40 కోట్లు


