MDK: వినాయక నిమజ్జనంలో తల్లిదండ్రులు పిల్లల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. నిమజ్జనాలకు వెళ్లే సమయంలో పిల్లలను చెరువులు, బావులు, కాలువలు, నీటి వనరుల వద్దకు ఒంటరిగా వెళ్లనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిమజ్జన ప్రదేశాల్లో పిల్లలను తమ వెంట ఉంచుకోవాలని, లోతు తెలియని ప్రాంతాల్లోకి వెళ్లకుండా చూడాలన్నారు.
తెలంగాణ
తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి: SP


