WGL: వర్ధన్నపేట పట్టణంలోని శ్రీనివాస వైన్స్‌లో గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగుడు చోరీకి పాల్పడ్డాడు. షాపు పై ఉన్న రేకును తొలగించి షాపులోకి ప్రవేశించిన దుండగుడు చిల్లర నగదు ఉన్న మూటను అపహరించినట్లు షాపు యజమాని తెలిపారు. మూటలో సుమారు రూ.లక్ష వరకు చిల్లర నగదు ఉన్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
తెలంగాణ
VIDEO: వైన్స్‌లో చోరీ.. చిల్లర నగదు మూట అపహరణ


