హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో విమోచన దినోత్సవం

MBNR: మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు ఎ. సంజీవ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ విమోచన కోసం పోరాడిన వీరులను స్మరించుకున్నారు. ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని సంజీవ్ ముదిరాజ్ అన్నారు.