NTR: నందిగామలో విశ్వకర్మ జయంతి మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య భక్తులతో కలిసి ఊరేగింపులో, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ మహిళలు 108 జల బిందెలతో జలాభిషేకం చేశారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత అన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు


