హైదరాబాద్: 28°C
తెలంగాణ

పల్లెర్ల క్లస్టర్‌లో సహజ వ్యవసాయంపై సమీక్ష సమావేశం

BHNG: పల్లెర్ల గ్రామంలో నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ (NMNF) కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పనుల పురోగతిని జిల్లా కోఆర్డినేటర్ విక్రమ్ సమీక్షించారు. ఏఈఓ ఎం. అశోక్‌కుమార్ సమక్షంలో NF&CRPs పనితీరు, క్షేత్రస్థాయి కార్యక్రమాలు, రైతులకు కల్పిస్తున్న అవగాహనపై సమీక్ష నిర్వహించారు. సహజ వ్యవసాయ పద్ధతులపై రైతులకు మరింత అవగాహన కల్పించాలని సూచించారు.