ASR: కొయ్యూరు మండలంలో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురుస్తోంది. గత రెండు మూడు రోజుల నుంచి వాతావరణంలో మార్పు నెలకొంది. మండలంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడుతోంది. భారీ వర్షం పడితే అక్కడక్కడా వరి నాట్లు వేసిన రైతులకు మేలు జరుగుతుందని రైతులు భావించారు. ఈక్రమంలో ఇవ్వాళ కాకరపాడు, పిట్టచలం, పనసలపాడు తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కొయ్యూరులో కురుస్తున్న భారీ వర్షం


