ఖమ్మం బీజేపీ జిల్లా కార్యాలయంలో గురువారం తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు కార్యాలయంపైన జాతీయ జెండాను ఎగురవేశారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఓటు బ్యాంకు కోసం రాజకీయ పార్టీలు తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం లేదని ఆయన అన్నారు.
తెలంగాణ
బీజేపీ కార్యాలయంలో విమోచన దినోత్సవం..


