KDP: వినాయక చవితి సెలవులు ముగియడంతో కడపలోని బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. పాఠశాల, కళాశాల విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. పాత బస్టాండులో రాజంపేట, పులివెందుల మార్గాల్లో బస్సుల కొరతతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం వేళల్లో అదనపు సర్వీసులు నడపాలని ఆర్టీసీ అధికారులను ప్రయాణికులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బస్సుల కొరతతో ప్రయాణికుల ఇక్కట్లు..!


