హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అస్తిత్వ పోరాటానికి ప్రతీక తెలంగాణ'

KNR: కరీంనగర్ పోలీస్ గ్రౌండ్స్‌లో గురువారం ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అస్తిత్వ పోరాటానికి ప్రతీకగా నిలిచిందన్నారు. సాయుధ రైతాంగ పోరాటం నుంచి రాష్ట్ర ఏర్పాటు వరకు జరిగిన పోరాటాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయని తెలిపారు.