హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కోడి రామ్మూర్తి స్టేడియంలో గ్యాలరీ ఏర్పాటు'

శ్రీకాకుళం నగరంలోని కోడి రామమూర్తి క్రీడా మైదానంలో గ్యాలరీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. కోడి రామూర్తి క్రీడా మైదానం పనులను స్థానిక శాసన సభ్యులు గొండు శంకర్, ఆర్ అండ్ బి అధికారులతో కలసి ఆయన గురువారం పరిశీలించి, కొన్ని సూచనలు చేశారు.