హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జోరుగా ఎడ్ల బండలాగుడు పోటీలు

GNTR: ప్రత్తిపాడులో జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలు మూడోరోజు గురువారం ఉత్సాహంగా సాగుతున్నాయి. నందమూరి తారక రామారావు మెమోరియల్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు హాజరై ఎద్దుల ప్రదర్శనను వీక్షించారు. ముఖ్య అతిథిగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు.