KDP: పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లె రాఘవేంద్రస్వామి ఆలయం సమీప కాలనీలో 10 రోజులుగా తాగునీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బోరులో నీరు అడుగంటిపోవడంతో పైపులైన్ ద్వారా నీరు రావడం లేదని స్థానికులు తెలిపారు. దీంతో డబ్బులు వెచ్చించి వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకుంటున్నారు. అధికారులు స్పందించాలని కాలనీవాసులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
బ్రాహ్మణపల్లెలో నీటి సరఫరా బంద్


