హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వడ్డాదిలో ఉచిత కంటి వైద్య శిబిరం

AKP: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా వడ్డాదిలో గురువారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ వడ్డీ సత్యారావు ఆధ్వర్యంలో జరిగిన శిబిరాన్ని బీజేపీ నేత దూది రాజేష్ ప్రారంభించారు. సుమారు 50 మందికి కంటి పరీక్షలు చేసి మందులు అందించారు. ఆపరేషన్ అవసరమైన వారికి ఉచిత ఆపరేషన్లు, రవాణా సౌకర్యం కల్పిస్తామని నిర్వాహకులు తెలిపారు.