హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మహాగణపతి వద్ద బాంబ్ స్క్వాడ్ తనిఖీలు

కృష్ణా: మచిలీపట్నం మంగినపూడి సాగరతీరంలో నిర్వహిస్తున్న మహాగణపతి ఉత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. రోజురోజుకూ భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. వీఐపీలు, వీవీఐపీలు ఉత్సవాలకు రానున్న నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. భక్తులు, ప్రముఖుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు.