హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజాంపేట SI రాజేష్ మల్కా చెరువు పరిశీలన

MDK: గణేష్ నిమజ్జనం సందర్భంగా నిజాంపేట SI రాజేష్ స్థానిక అధికారులతో కలిసి మల్కా చెరువును పరిశీలించారు. ప్రజలు చెరువు లోపలికి వెళ్లకుండా మొదటి భాగంలోనే నిమజ్జనాలు పూర్తి చేయాలన్నారు. వెలుతురు, గజఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని పంచాయతీకి సూచించారు. మద్యం సేవించి చెరువులోకి దిగొద్దని, పిల్లలను తేకూడదని హెచ్చరిస్తూ ప్రజలు సహకరించాలని కోరారు.