హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాగునీటికి బదులు మురుగు నీరు

కోనసీమ: రాజోలు మండలం సోంపల్లి ఇందిరా కాలనీలో పంచాయతీ కుళాయి నీరు స్థానికులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. తాగునీటికి బదులుగా డ్రైనేజీ మురుగునీటిని తలపించేలా దుర్వాసనతో, మురికిగా నీరు వస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి కోసం కుళాయి తెరిస్తే మురుగు నీరే వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.