ADB: సిరికొండ గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ బొడ్డ దత్తాత్రి జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజా ప్రభుత్వ పథకాలు నిరుపేదలకు అందుతున్నాయని తెలిపారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
సిరికొండలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం


