GDWL: తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ గద్వాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ టి. శ్రీనివాసరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సర్దార్ పటేల్ చొరవతో హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైన చారిత్రక ఘట్టాన్ని గుర్తుచేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
ఎస్పీ కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవం


