హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలకు ప్రహరీ లేక ఇబ్బందులు

SRD: సిర్గాపూర్ మండలం గోసాయిపల్లి పాఠశాలకు చుట్టూ ప్రహరీ గోడ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందులో పశువులు, ఇతర జంతువులు సంచరిస్తున్నాయని టీచర్లు, విద్యార్థులు నేడు తెలిపారు. గతంలో కాంపౌండ్ వాల్ తదితర అభివృద్ధి పనులు మంజూరు చేసినప్పటికీ, నిధులు రాక పనులు ఆగినట్లు స్థానికులు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి నిధులు మంజూరు చేయాలని స్థానికులు కోరారు.